incident | స్విమ్మింగ్ పూల్‌లో పడి…

incident | స్విమ్మింగ్ పూల్‌లో పడి…

incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి సమీపంలో ఉన్న వ్యాస ఫామ్‌హౌస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందాడు. ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

హైదరాబాద్ మజీద్‌బండ ప్రాంతానికి చెందిన సాయి తన స్నేహితులతో కలిసి ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. సరదాగా గడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయినట్లు సమాచారం. యాక్సిస్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సాయి పూల్‌లో పడిపోవడాన్ని ఎవరూ గుర్తించలేదు.

మరుసటి రోజు ఉదయం వాచ్‌మన్ పూల్‌లో సాయిని గుర్తించి స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఏడాది బాబు ఉన్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply