Rs 2959 Cr Projes : బుల్లెట్ స్పీడ్ తో.. అభివృద్ధి Andhra Prabha Top Story
Rs 2959 Cr Projes : బుల్లెట్ స్పీడ్ తో.. అభివృద్ధి Andhra Prabha Top Story
- పుట్టపర్తిలో ఏఎంసీఏ శంకుస్థాపన
- సీమను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం
- కేజీఎఫ్ కాదు.. ఇక జేజీఎఫ్
- 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు
- డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ప్రాధాన్యం
- యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా ప్రభుత్వం
- ‘నా దేశం – నా బాధ్యత’పై చంద్రబాబు పిలుపు
( ఆంధ్రప్రభ, శ్రీసత్యసాయి బ్యూరో )

అభివృద్ధిని బుల్లెట్ స్పీడ్ తో తీసుకెళ్తున్నాం. అవకాశాలు తెచ్చే బాధ్యత మాది. వాటిని అందిపుచ్చుకునే బాధ్యత యువతది. అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1935 మంది ఉపాధికి కల్పించే రూ. 2959 కోట్ల మూడు డిఫెన్స్ ప్రాజెక్టులు డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, HFCL సంస్థలకు చెందిన ప్రాజెక్టులకు అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు , రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంత్రి నారా లోకేష్ . AMCAతో పాటు మరికొన్ని డిఫెన్స్, డ్రోన్ సిటీ లోని ప్రాజెక్టులకు శంకుస్థాపన స్థాపన చేశారు. అనంతరం వేదిక వద్ద మిస్సైల్ లు, హ్యాండ్ గ్రేనేడ్, ఆధునిక తుపాకులు, యుద్ధ విమానం ప్రొటోటైప్ లాంటి రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, మంత్రి లోకేష్ తిలకించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ , ఏపీ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాయలసీమలో ఇనుము, , సున్నపు రాయి ఖనిజ వనరుల్ని సమర్ధంగా వినియోగించుకుంటాం.. కడప స్టీల్ ప్లాంటును జూన్ లో ప్రారంభిస్తాం… 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం. అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
Rs 2959 Cr Projes : 80 దేశాల్లో సీమ కార్లు

స్టీల్, సిమెంట్ ప్లాంట్లు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, స్పేస్ , ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ లాంటి పరిశ్రమలతో రాయలసీమ రతనాల సీమగా మారుస్తాం, అన్నారు. కొప్పర్తి పారిశ్రామిక నోడ్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా మారుతుంది.తిరుపతిలో రాయల్ ఎన్ ఫీల్డ్ ప్లాంట్, శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తాం. అన్నారు. అన్నారు. కియా పరిశ్రమ 18 లక్షల కార్లు తయారు చేస్తోంది. కరవు సీమలో తయారైన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయి. ఆర్డీటీ సంస్థకు విదేశీ విరాళాల విషయంలో సమస్య ఉత్పన్నమైతే కేంద్రంతో మాట్లాడి మంత్రి లోకేష్ ఆ సమస్యను పరిష్కరించారని సీఎం వివరించారు.
Rs 2959 Cr Projes : కేజీఎఫ్ కాదు.. ఇక జేజీఎఫ్

గతంలో గోల్డ్ అంటే KGF, ఇప్పుడు గోల్డ్ అంటే JGF… జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ కర్నూలులో వస్తోంది. JGFలో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. రెండో ఏడాది 1500 కిలోల బంగారం తయారవుతుంది. రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకమవుతుంది. తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, అహోబిలం, పుట్టపర్తి లాంటి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను పెంచుతున్నాయి. సమర్ధ నీటి నిర్వహణతో జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి.సమర్ధవంత పాలన ఫలితంగానే రిజర్వాయర్లలో నిండుగా నీరు ఉన్నాయి, అని సీఎం చంద్రబాబు అన్నారు.
Rs 2959 Cr Projes : 23 నెలల్లో… 23 లక్షల కోట్లు

గత పాలనలో విధ్వంసం చేశారు. పరిశ్రమలు తరిమేశారు. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మళ్లీ ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటివల్ల 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఇక్కడే ఉద్యోగాలు రావాలి, ఇతరులకూ మనమే ఉపాధి కల్పించేలా పరిశ్రమలు వస్తున్నాయి.గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రాజెక్టులు వచ్చాయి. రిలయన్స్, బీపీసీఎల్ లాంటి ప్రాజెక్టులు వస్తాయి, అని సీఎం వివరించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు ఎకనామిక్ రీజియన్లలో పెట్టుబడులు వస్తాయి. చిప్ నుంచి షిప్ వరకూ మన దేశంలోనే తయారు కావాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ఏపీలో డిజైన్ చేయండి, పెట్టుబడులు పెట్టండి, తయారు చేయాలని నేను కోరుతున్నాను. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏపీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం… వేగంగా అనుమతులిస్తాం. దేశానికి తిరుగులేని శక్తిగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తయారవుతాయి, అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
Rs 2959 Cr Projes : నా దేశం.. నా బాధ్యత పాటిద్దాం

ఆర్ధిక భద్రత కూడా అత్యంత కీలకం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మనపై కూడా పడింది. ఇంధనం, బంగారం కొనుగోలుతో విదేశీ మారకనిల్వలు తరిగి పోతున్నాయి. నాదేశం- నాబాధ్యత అనే అంశంపై అందరం దృష్టి పెట్టాలి. ప్రధాని ప్రతిపాదించిన వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి 7 అంశాలను మనం కూడా ఆచరిద్దాం. ఇతర దేశాలు కూడా పొదుపు చర్యలు చేపట్టాయి. మనం కూడా బాధ్యతతో ముందుకు వెళ్లాలి. పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ సంఖ్యను తగ్గించాం. దీనిపై ఓ కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం. ప్రతీ భారతీయుడు సవాళ్లను అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ సవాలును మనం ఓ అవకాశంగా మలచుకుందాం. ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం వహించాలి, అని సీఎం చంద్రబాబు కోరారు.
ALSO READ : Pm Modi Visits : ప్రధానికి ఏపీ సీఎం ఆతిథ్యం Andhra Prabha News
