Pm Modi Visits : ప్రధానికి ఏపీ సీఎం ఆతిథ్యం Andhra Prabha News
Pm Modi Visits : ప్రధానికి ఏపీ సీఎం ఆతిథ్యం Andhra Prabha News
- కుటుంబ సభ్యులతో ప్రధానికి ఘన స్వాగతం
- లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ఆతిథ్యం
- దైవాన్ష్‌తో మోదీ ఆత్మీయ క్షణాలు
- “చిరస్మరణీయ సాయంత్రం” : చంద్రబాబు వ్యాఖ్య
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ మద్దతుపై కృతజ్ఞత
- ట్విట్టర్‌లో ఏపీ సీఎం భావోద్వేగ పోస్ట్
( ఆంధ్రప్రభ, హైదరాబాద్)

Pm Modi Visits : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు. ప్రధాని రాకతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు, కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరీ, భ్రాహ్మణి, ఏపీ సీఎం మనవడు దైవాన్ష్ ప్రధానికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు అతిథి సత్యారం చేశారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఈ రోజు మా కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక చిరస్మరణీయ సాయంత్రం. మా నివాసంలో గౌరవశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వడం మాకు గౌరవంగా ఆనందంగా ఉంది. ఆయన ఆప్యాయత, అనురాగం ఉదార సంభాషణ తో అందరం నిజంగా ప్రత్యేకంగా ఆనందపడ్డాం. ఈ దయగల ఆతిథ్యానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి ఆయన అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి, మద్దతుకు ప్రధానమంత్రిచంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో ధన్యవాదాలు తెలిపారు.

