బాధితుడికి ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

బాధితుడికి ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన గొడిశాల చంద్రశేఖర్ అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఎల్‌ఓ సీ చెక్కును మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో బాధితునికి అందజేశారు.

ఈ సందర్భంగా ఎల్‌ఓసీ మంజూరు చేసినం దుకు ఎమ్మెల్యేకు సీపీఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్, ఉప సర్పంచ్ లింగనబోయిన రాజు, నాయకులు తోడెంగల ఐలయ్య, వంగపండ్ల సోమయ్య, మంద మోగిలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply