పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి..

  • సర్పంచ్ ఆవుల సుందర్

చిట్యాల, ఆంధ్రప్రభ : పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని సర్పంచ్ ఆవుల సుందర్ సందర్భం పేర్కొన్నారు. మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో వైద్య సిబ్బంది ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఏ ఒక్క చిన్నారిని పోలియో చుక్కలకు దూరం చేయొద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.