వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

పరకాల, ఆంధ్రప్రభ ; పరకాల మండలం మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాథచార్య విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 5 గంటల నుండి అభిషేకాలు నిర్వహించారు.
హనుమాన్ దీక్ష స్వాములు హనుమాన్ అభిషేకంలో పాల్గొన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు ఉదయం 6 గంటల నుండి దర్శనం చేసుకుని స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. వందలాది మంది భక్తులు హనుమాన్ చాలీసా సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
