Anushka | స్వీట్ వార్నింగ్..

Anushka | స్వీట్ వార్నింగ్..
Anushka | పెళ్లి వార్తలపై అనుష్క టీమ్ ఫైర్
బిజినెస్ మ్యాన్‌తో వివాహం అంటూ వైరల్ ప్రచారం
వయసు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీమ్
‘కథనార్’తో థ్రిల్లర్ జానర్‌లో అనుష్క ఎంట్రీ
నెగిటివ్ షేడ్స్ పాత్రలో భయపెట్టనున్న అనుష్క
Anushka | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అందం, అభినయం.. ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథనాయికల్లో ఒకరు అనుష్క. ఈ అమ్మడు పెళ్లి గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. రీసెంట్ గా అనుష్క పెళ్లి గురించి వార్త వైరల్ అయ్యింది. ఈసారి సీరియస్ అని.. తన ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి అంటూ ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో ఉన్న వార్తల పై అనుష్క టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ.. అసలు నిజం ఏంటి..?
Anushka | అది నిజం కాదు..

పెళ్లి గురించి మీడియాలో వార్తలు రావడం పై అనుష్క సీరియస్ అయ్యిందని.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా రాస్తారంటూ అనుష్క టీమ్ ఫైర్ అయ్యింది. పైగా ఆమెకు 44 సంవత్సరాలు వయసు అంటూ చెప్పడం కరెక్ట్ కాదని.. ఇది పరోక్షంగా ఒక వ్యక్తిని కించపరచడమే అని చెప్పింది. ఇదే ఉత్సాహం సగటు నటుల విషయంలో ఎందుకు కనిపించదు.. హీరోయిన్స్ గురించే ఇలా వయసు గురించి రాస్తారేందుకు అన్నారు. నిజాలు తెలుసుకోకుండా రాయద్దని.. ఏదైనా సమాచారం ఉంటే.. అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పారు.
Anushka | భయపెట్టబోతున్న అనుష్క..

అనుష్క సినిమాల విషయానికి వస్తే.. మలయాళంలో ఫస్ట్ టైమ్ కథనార్ అనే థ్రిల్లర్ మూవీ చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ఈ నెల 31న రిలీజ్ చేయనున్నారు. ఇందులో మోహన్ లాల్, ప్రభుదేవ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 9వ శతాబ్ధానికి చెందిన క్రైస్తవ మత పెద్ద కడమట్టతు కథనార్ జీవితం ధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీకి రోజిన్ థామస్ దర్శకత్వం వహించారు. ఇందులో అనుష్క నీల అనే నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రతో భయపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అనేది గ్లింప్స్ తో ప్రకటించనున్నారు.

