షార్ట్ సర్క్యూట్ తో 350 బస్తాల మొక్కజొన్న దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో 350 బస్తాల మొక్కజొన్న దగ్ధం

  • ప్రభుత్వం ఆదుకోవాలని రైతు పొగాకు శ్రీనివాస్ అభ్యర్థన

దుగ్గొండి, ఆంధ్రప్రభ : దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో అమ్మకానికి సిద్ధంగా పెట్టుకున్న 350 బస్తాల మొక్కజొన్నలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది.ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. వెంకటాపురం శివారు బీసీ కాలనీకి చెందిన పొగాకు శ్రీనివాస్ అనే రైతు ప్రభుత్వ గిడ్డింగుల గోదాము సమీపంలో గల తన రెండు ఎకరాల మీద మొక్కజొన్న పంటను కోసి జొన్నలను కుప్పలుగా పేర్చి ఉంచారు.

గురువారం ఉదయం వీచిన గాలికి సమీపంలో ఉన్న కరెంటు తీగలు ఒకదానికే ఒకటి తగిలి షార్ట్ సర్క్యూట్ తో నిపుల్ చిలరేగి మొక్కజొన్నలు పూర్తిగా దగ్ధమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న మొక్కల విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని రైతు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నష్టపోయిన తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రైతును పరామర్శించిన సర్పంచ్ :

పండించిన మొక్కజొన్నలు దగ్ధం కావడంతో రైతు పొగాకు శ్రీనివాస్ ను స్థానిక సర్పంచ్ శోభారాణి వెంకటేశ్వర్లు గౌడ్ విద్యుత్ ఘాతంతో చేతికొచ్చిన పంట బూడిదైన నేపథ్యంలో వెంకటాపురం సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు గౌడ్ పరామర్శించారు. కాలిపోయిన మొక్కజొన్న రాశులను పరిశీలించారు. విద్యుత్ అధికారులతో పాటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి దృష్టికి తీసుకువెళ్లి ఆదుకునేందుకు కృషి చేస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు .

Leave a Reply