కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం

కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం

  • రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు

జనగామ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 9 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగాల కళ్యాణి తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా కృష్ణస్వామి అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ,ఉచిత విద్యుత్తు, రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ, 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని అన్నారు.

అధికారం పోయిన బి ఆర్ఎస్ నేతలకు మతిపోయి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని ఆమె ఆరోపించారు. 10 సంవత్సరాల కాలంలో జనగామ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగలేదని, అవినీతి పెరిగిపోయిందని అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ గా ఎంతో అనుభవం ఉన్న వంగాల కళ్యాణి తిరిగి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ నీలం పద్మ ,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్టేట్ జనరల్ సెక్రెటరీ పిన్నింటి కావ్య శ్రీ రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రెటరీ బుట్ రెడ్డి శ్రీలత రెడ్డి ,స్టేట్ సెక్రెటరీ వంగాల కళ్యాణి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మున్నీ బేగం, జిల్లా సెక్రెటరీ లు సక్కుబాయి, పద్మ ,మానస ,టౌన్ అధ్యక్షురాలు శ్రీలత ,మండల అధ్యక్షులు భాగ్యలక్ష్మి ,శోభ, వార్డు అధ్యక్షులు నవనీత, ధనలక్ష్మి ,లక్ష్మి , మహిళల నాయకులు కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply