ఎల్టా జిల్లా అధ్యక్షులుగా గడ్డం జగదీశ్వర్..
- ప్రధాన కార్యదర్శిగా డి.నాగరాజు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఇంగ్లీషు లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) పెద్దపల్లి జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా గడ్డం జగదీశ్వర్(రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), ప్రధాన కార్యదర్శిగా డి. నాగరాజు(జిప ఉన్నత పాఠశాల జూలపల్లి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనoగా ఎన్నికైన ఎల్టా అధ్యక్షులు గడ్డం జగదీశ్వర్ మాట్లాడుతూ 2016లో ఏర్పడిన ఎల్టా అధ్వర్యంలో ఉపాధ్యాయులకు సృజనాత్మక బోధన వ్యూహాలు, టెక్నాలజీ వినియోగం, కంటిన్యూఎస్ ప్రొఫెషనల్ డెవెలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతూ ఉపాధ్యాయుల అభివృద్ధి తోడ్పడుతున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల ఆంగ్లం భాషాభివృద్ధికి పాఠ్యాంశాల అభ్యాసన ఫలితాలు (లెర్నింగ్ ఔట్కమ్స్) సాధించుటకు, శ్రవణo, భాషణం, చదవడం, సృజనాత్మకంగా రాయడం వంటి వివిధ రకాల ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. స్పెల్ బి, వన్ మినిట్ ఇంగ్లీషు, స్టేజ్ పెర్ఫార్మెన్స్ సృజనాత్మక నాటికల పోటీలు, ఆంగ్లం జి.కె. టెస్ట్, పబ్లిక్ పరీక్షలకు అనుబంధంగా పోటీ పరీక్షలు, సమకాలీన అంశాలపై ఉపన్యాస పోటీలు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్థూ విజేతలకు ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందిస్తున్నామని చెప్పారు.
విద్యార్థుల ఆంగ్లం అభివృద్ధి కోసం ఎల్టా అధ్వర్యంలో కృషి చేస్తున్నామని తెలియచేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా జె. శ్రీనివాస్, జి. రమేష్, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎస్. రజనివందన, సంయుక్త కార్యదర్శులుగా వై . శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి. శేషాద్రి, మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇందిర, మీడియా కోఆర్డినేటర్ గా ఎ. కనకయ్య, ఫైనాన్స్ సెక్రటరీగా బి.లక్ష్మణ్ లను ఎన్నుకున్నారు. వీరితో పాటుగా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్, మండల కన్వీనర్ లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారులుగా ఆంగ్లం సీనియర్ ఉపాధ్యాయులు సాధుల వెంకటేశ్వర్లు, కె. సత్యప్రకాశ్ రావు వ్యవహరించారు.
