రెవెన్యూ అంశాలపై ప్రత్యేక సీఎస్ సమీక్ష
రెవెన్యూ అంశాలపై ప్రత్యేక సీఎస్ సమీక్ష
22ఏ, వెబ్‌ల్యాండ్ సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం
పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశం
తిరుపతి, ఆంధ్రప్రభ : భూపరిపాలన, రెవెన్యూ శాఖలకు సంబంధించిన పలు కీలక అంశాలపై జిల్లా కలెక్టర్లతో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ), రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ సమీక్షలో 22ఏ, వెబ్‌ల్యాండ్, రీ సర్వే, పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ, మాన్యువల్ రికార్డుల డిజిటలైజేషన్, ఐవీఆర్ఎస్ అంశాలపై చర్చించారు.
జిల్లాల్లో భూపరిపాలన పనులను వేగవంతం చేయాలని, పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పెషల్ సీఎస్ జయలక్ష్మి అధికారులను ఆదేశించారు. రీ సర్వే పనులు, వెబ్‌ల్యాండ్ సమస్యల పరిష్కారం, పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. భూపరిపాలనకు సంబంధించిన ప్రతి అంశంలో ఖచ్చితత్వం పాటిస్తూ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ల్యాండ్ అండ్ సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
