రేషన్ బియ్యం పట్టివేత….

రేషన్ బియ్యం పట్టివేత….
–15,క్వింటాల రేషన్ బియ్యం, ట్రాలీ ఆటో స్వాధీనం,
చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా మండల కేంద్రం శివారు పెట్రోల్ పంపు వద్ద సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు , తన సిబ్బందితో సోమవారం టేకుమట్ల వైపు నుండి వస్తున్న అశోక లీలాండ్ ట్రాలీ ఆటో తనిఖీ చేయగా అందులో (పిడిఎస్) రేషన్ బియ్యం బస్తాలు ఉండగా, వాటిని స్వాధీనం చేసుకుని ట్రాలీ ఆటోను పోలీస్ స్టేషన్ తరలించారు.
చిట్యాల ఎస్సై జి శ్రావణ్ కుమార్ కథనం ప్రకారం …చిట్యాల పెట్రోల్ పంపు వద్ద సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు, సిబ్బందితో ఉండగా టేకుమట్ల వైపు నుండి వస్తున్న అశోక లీలాండ్ ట్రాలీ నీ తనిఖీ చేయగా, అందులో పిడిఎస్ బియ్యం బస్తాలు ఉండగా, ఆ బియ్యం, కక్కెర్ల సంపత్, తన డ్రైవర్ చుక్క రాజు, సహాయంతో పరకాల చుట్టూ ప్రక్కల గ్రామాలలో తక్కువ రేటుకు కొని, అట్టి బియ్యాన్ని మహారాష్ట్రలో అధిక రేటుకు అమ్మడానికి తీసుకెళ్తానని తన నేరాన్ని అంగీకరించారన్నారు.
ఆ బియ్యాన్ని తూకం వేయగా 15.5 క్వింటాళ్ల బియ్యం 35 సంచులు ఉండగా స్వాధీనం చేసుకొని, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సమ్మిరెడ్డి ఉన్నారు.
