కొనుగోలు కేంద్రా ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని తరలించాలి

కొనుగోలు కేంద్రాల ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని తరలించాలి

అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ డిమాండ్

గుండాల/ ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ: గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ ద్వారా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించి రైతుల దగ్గర కొనుగోలు చేసి పది రోజులైనప్పటికీ,నేటివరకు ప్రభుత్వం ఒక్కలారీ తో లోడ్లు పంపలేదని, తక్షణమే కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటలను లారీల ద్వారా తీసుకెళ్లాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, బచ్చల సారన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండాల పిఎసిఎస్ ముందు రైతులతో కలిసి ఆందోళన నిర్వహించడం జరిగిందని తెలిపారు. వారం, పక్షం రోజులు క్రితం మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పటికీ నేటివరకు లారీల ద్వారా తీసుకెళ్లకపోవడంతో ధాన్యంతో సొసైటీ ప్రాంగణం మొత్తం నిండిపోయిందని, దాంతో వాతావరణ శాఖ తెలంగాణలో రాబోయే మూడు రోజు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తుండడంతో రైతు గుండెలు గుబాలనిపిస్తూ, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని మండి పడ్డారు.

వర్షం కురిస్తే మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోతుందని దీని దృష్టిలో పెట్టుకొని మార్క్ ఫేడ్ అధికారులు,తక్షణమే లారీలు పంపించి మొక్కజొన్న ధాన్యాలను క్రయవిక్రయాలను జరిపి తరలించాలని డిమాండ్ చేశారు.లేనియెడల మొక్క జొన్న ధాన్యంతో పండించిన రైతులతో పెద్దఎత్తున ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ,అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ నాయకులు యాసారపు వెంకన్న, గడ్డంలాలయ్య, పర్శక రవి, అరెం నరేష్, మోకాళ్ళ సూర్యనారాయణ, గోగ్గల శ్రీను, పాయం ఎల్లన్న, భూక్యా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని తరలించాలి

Leave a Reply