దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి

దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి
శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: దండుమల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం అభివృద్ధి కోసం నూతన పాలకవర్గం కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సూచించారు.చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం నూతన చైర్మన్‌గా కంచర్ల అశ్విన్ రెడ్డి, అలాగే మరో 13 మంది పాలకవర్గ సభ్యులతో ఎండోమెంట్ సూపరింటెండెంట్ వెంకట్ లక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం ఎండోమెంట్ కమిషనర్‌తో మాట్లాడతానని తెలిపారు. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్ పబ్బు రాజు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, నూతన పాలకవర్గ సభ్యులు ఈదుల బాబు, బేతాళ నరసింహ, సిద్దిపేట ఆనంద్ రెడ్డి, వెంకిరాల శివ, బాలగోని శ్రీకాంత్, బొంతల యువరాజు, మన్నే మహేందర్ రెడ్డి, దౌడీ రాజేష్, పన్నాల మహేందర్ రెడ్డి, దేప రాజీవ్, పంతంగి రమేష్, జొన్నకంటి దాసు, చిట్టెంపల్లి సబిత తదితరులు పాల్గొన్నారు.

