ఎమ్మెల్యే సహకారంతో నిరుపేద మహిళకు సొంత ఇల్లు
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద మహిళకు సొంతింటి కల సాకారమైంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామానికి చెందిన పగిళ్ళ పార్వతమ్మకు గ్రామ పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు.
ఇంటి నిర్మాణం పూర్తికావడంతో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్ పాల్గొని పార్వతమ్మ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇంటి యజమాని పగిళ్ల పార్వతమ్మ మాట్లాడుతూ పేదల కోసం నిరంతరం కృషి చేస్తు,తమ సొంతింటి కల నెరవేర్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బొమ్మగాని భిక్షం గౌడ్,గాదె నరసింహ, నరసింహ,పున్నం యాదమ్మ,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
