మ‌రో వారం రోజులు..

ఈ జిల్లాల్లో వాన‌లే వాన‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా క్యుమిలోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడటంతో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 13వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్ప‌టికే రాష్ట్ర‌వ్యాప్తంగా వాన‌లు వ‌ద‌ల‌కుండా కొడుతున్నాయి. ప్ర‌తీరోజూ ఏదో స‌మ‌యంలో వ‌ర్షం ప‌డుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.

ఈ రోజు (బుధవారం, అక్టోబ‌ర్ 8) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.