ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన డీఎస్పీ..

రాప్తాడు, ఆంధ్రప్రభ : ధర్మవరం నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జగన్నాథరాజు గురువారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ధర్మవరం సబ్‌డివిజన్ పరిధిలోని రాప్తాడు నియోజకవర్గ పరిస్థితులు, గతంలో జరిగిన పరిణామాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఇద్దరూ చర్చించారు.

నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కొనసాగడం తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని డీఎస్పీకి సూచించారు.

చట్టం ముందు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తమవైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.