దక్షిణ మధ్య రైల్వే విజయంతో టోర్నీకి శుభారంభం

దక్షిణ మధ్య రైల్వే విజయంతో టోర్నీకి శుభారంభం

సికింద్రాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 47వ ఆల్ ఇండియా రైల్వే కబడ్డీ (మహిళలు) ఛాంపియన్‌షిప్‌ ఘనంగా ప్రారంభమైంది. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (RSPB) ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ (SCRSA) ఈ టోర్నమెంట్‌ను అక్టోబర్ 7 నుండి 10 వరకు నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, SCRSA అధ్యక్షురాలు అండ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్, SCRSA జనరల్ సెక్రటరీ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పి.కోటేశ్వరరావు, సీనియర్ అధికారులు, క్రీడా సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు.

ఈ పోటీలో సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వే, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, నార్త్ ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే అండ్ ఆతిథ్య దక్షిణ మధ్య రైల్వే సహా మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ, జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొనడం వల్ల పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.

ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణ మధ్య రైల్వే 48 పాయింట్లతో నార్త్ ఈస్టర్న్ రైల్వేపై విజయం సాధించింది. నార్త్ ఈస్టర్న్ రైల్వే 25పాయింట్లు సాధించింది. ఈ సందర్భంగా అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ మాట్లాడుతూ… జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా స్ఫూర్తి, నిబద్ధత, కృషితో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆటగాళ్లను ప్రోత్సహించారు. ఈ ఛాంపియన్‌షిప్ అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది.

Leave a Reply