Varun Tej | ట్రైలర్‌కు రంగం సిద్ధం, రచ్చకు కౌంట్‌డౌన్ మొదలు!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం సినిమాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమా ట్రైలర్ సంబంధించిన కీలక అప్డేట్ ను చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆగస్టు 1, 2026న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఉదయం 10 గంటల నుంచి ఏఏఏ సినిమాస్‌లో అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ సంగీతం అందించగా… ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచగా, ఇప్పుడు ట్రైలర్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది
