పేదలకు అండగా కూటమి ప్రభుత్వం
- ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ: ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సింగ్ నగర్ సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 62,64వ డివిజన్లకు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ.. తీవ్రమైన అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు.ఆర్థిక ఇబ్బందులతో చికిత్సను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె.రవికుమార్,కార్యాలయం ఇంచార్జి ఘంటా కృష్ణ మోహన్,61వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్,ప్రధాన కార్యదర్శి ఎస్. కె బాబు, కోమరి రాజేష్,కంకణాల బాబు తదితరులు పాల్గొన్నారు.
