ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి..

రీజనల్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రామ్మోహన రెడ్డి


ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఎన్.రామ్మోహన్ రెడ్డి అన్నారు. కేతనకొండలోని ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డీసీ) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కెరీర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణయ్య మాట్లాడుతూ… పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ఉద్యోగ మార్కెట్ పై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తాయని తెలిపారు. శిక్షణ, ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ చల్లా మధుభూషణరావు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సీపాన శ్రీనివాసరావు, కెరీర్ అవేర్నెస్ ట్రైనర్లు శివ కృష్ణరాజు, పవన్, కో – ఆర్డినేటర్ కిషోర్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, పోటీపరీక్షల ప్రిపరేషన్, అవసరమైన స్కిల్స్, కెరీర్ ప్రణాళికపై విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు.