సీపీని కలిసిన జి.ఎల్. శ్రీధర్
నగరంలో పెట్రోలింగ్ పెంచాలని విజ్ఞప్తి
కాశిబుగ్గ, ఆంధ్రప్రభ: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డిని ఆల్ ఇండియా ఎన్‌బీకే ఫ్యాన్స్ కన్వీనర్ జి.ఎల్. శ్రీధర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
జి.ఎల్. శ్రీధర్‌తో పాటు వరంగల్ జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు నల్లకుంట రవికుమార్ కూడా పోలీస్ కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు మరింత శ్రద్ధ వహించాలని కోరారు. నగరంలో పెట్రోలింగ్‌ను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసుల పనితీరును మరింత మెరుగుపరిచి ఓరుగల్లు ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఆల్ ఇండియా ఎన్‌బీకే ఫ్యాన్స్ కన్వీనర్ జి.ఎల్. శ్రీధర్ కోరారు.
