గోదావరి నదిని పరిశీలించిన అధికారులు
వరద పరిస్థితిపై ఆరా..
పరివాహక ప్రాంత ప్రజలకు అప్రమత్తత సూచన
బాసర, ఆంధ్రప్రభ: బాసర వద్ద గోదావరి నది ప్రవాహాన్ని గురువారం మండల తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ప్రభావాన్ని అధికారులు పరిశీలించారు.
వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి నదిలో ఈత కొట్టడం, చేపల వేటకు వెళ్లడం నిషేధమని తెలిపారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ పరిశీలనలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అభిమన్యు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
