Rain | జలమయమైన రహదారులు..

Rain | జలమయమైన రహదారులు..

Rain |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో భారీ వర్షం కురిసింది. రెండు గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో కొండపై ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారీ వర్షం కారణంగా ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్‌లు, ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు వసతి గృహాలకు తిరిగి చేరుకునే వారూ ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల నీరు చేరడంతో భక్తులు అగచాట్లు పడాల్సి వచ్చింది.

తిరుమలతో పాటు తిరుపతి నగరంలోనూ భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు రహదారులు నీటమునిగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించగా, పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

Leave a Reply