ORR Accident | సుల్తాన్‌పూర్ సమీపంలో మూడు కార్లు ఢీ..

ఇద్దరు దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు..
వర్షంతో అదుపుతప్పిన ఫార్చ్యూనర్‌ కారు
ప్రమాదానికి కారణమైంద‌న్న‌ పోలీసులు

ORR Accident | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్‌)పై సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వర్షం కారణంగా వేగంగా వెళ్తున్న టయోటా ఫార్చ్యూనర్ కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.