Breaking News | భారీ పేలుడు.. 8మంది మృతి..

మరో 10మందికి తీవ్ర గాయాలు..


Breaking News | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో శనివారం ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10మంది తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం.

పేలుడు ధాటికి కర్మాగారం భారీగా దెబ్బతినడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రాథమిక వివరాల ప్రకారం, లైసెన్స్ రద్దు అయినప్పటికీ సంబంధిత యూనిట్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై విచారణ ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.