Japan Open | సింధూకు సీఎం రేవంత్ అభినందనలు
జపాన్ ఓపెన్ సూపర్-750 టైటిల్ విజేతకు ప్రశంసలు..
భారత క్రీడా రంగానికి గర్వకారణమన్న ముఖ్యమంత్రి
Japan Open | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధూకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సింధూ సాధించిన విజయం భారత క్రీడా రంగానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. తన ప్రతిభ, కఠోర శ్రమ, పట్టుదలతో సింధూ దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. కెరీర్‌లో తొలి సూపర్-750 టైటిల్‌ను సాధించిన సింధూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని మరింత ఎగురవేయాలని శుభాకాంక్షలు తెలిపారు.
