ఘనంగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను చౌటుప్పల్ మండలంలో బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో దండు మల్కాపూర్ శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, జగదీష్ రెడ్డి మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం నుంచి జిల్లా అభివృద్ధి వరకు జగదీష్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు వెంకటేష్, సింహాద్రి, సిద్ధగోని శ్రీనివాస్, నాయకులు గుండు లింగన్న గౌడ్, సుర్వి లింగస్వామి గౌడ్, కత్తుల సురేష్, మధు తదితరులు పాల్గొన్నారు.