Bullet Train Land Acquisition | రైతుల దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు..

బుల్లెట్‌ ట్రైన్‌ భూసేకరణ ప్రాంతంలో భారీ బందోబస్తు..
650 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్‌తో ఉద్రిక్తత

Bullet Train Land Acquisition | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శంషాబాద్‌ మండలంలోని బహదూర్‌గూడలో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు కోసం భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న దీక్షా శిబిరంలోని టెంట్లను తొలగించి, అక్కడ ఉన్న రైతులను ఇతర ప్రాంతాలకు తరలించారు.

భూసేకరణకు సంబంధించిన వివాదాస్పద ప్రాంతమైన సుమారు 650 ఎకరాల చుట్టూ రాత్రికి రాత్రి అధికారులు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి, బయటి వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో బహదూర్‌గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, హై అలర్ట్‌ ప్రకటించినట్లు సమాచారం.