England-Beats-France-6-4 : ఇంగ్లండ్ కాంస్య హాసం Andhra Prabha Sports News
England-Beats-France-6-4 : ఇంగ్లండ్ కాంస్య హాసం Andhra Prabha Sports News
- ఫిఫా టోర్నీలో మూడవ స్థానం
- 6-4 తేడాతో ఫ్రాన్స్ పై విజయం
- హ్యాట్రిక్ హీరో\సాకా
- ఎంబాప్పే వరల్డ్ రికార్డు
(ఆంధ్రప్రభ, క్రీడాప్రతినిధి )
ఫిఫా ప్రపంచ కప్ 2026 రజత పతకాన్ని ఇంగ్లండ్ జట్టు కైవశం చేసుకుంది. 6-4 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ జట్టును మట్టి కరిపించింది. మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరిత , అత్యధిక గోల్స్ నమోదు చేసిన క్లాసిక్ మ్యాచ్‌గా నిలిచిపోయింది. మొదటి అర్ధభాగంలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్, సెకండ్ హాఫ్‌లో పెను సంచలనాలకు దారితీసింది.చివరికి ఇంగ్లాండ్ 6 – 4 తేడాతో ఫ్రాన్స్‌పై చారిత్రాత్మక విజయం సాధించి, టోర్నీలో మూడో స్థానాన్ని బ్రాంజ్ మెడల్ ణ/ కైవసం చేసుకుంది.
సెమీఫైనల్లో ఓడిన నిరాశను పక్కనపెట్టి ఇంగ్లాండ్ జట్టు ఆరంభం నుంచే మైదానంలో విశ్వరూపం ప్రదర్శించగా, ఫ్రాన్స్ డిఫెన్స్ పూర్తిగా చేతులెత్తేసింది. మొదటి 45 నిమిషాల ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 4-0 తో భారీ ఆదిద్యం ప్రదర్శించింది. మ్యాచ్ ప్రారంభమైన 3వ నిమిషంలోనే ఇంగ్లాండ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ డెక్లాన్ రైస్ అద్భుత గోల్ చేసి జట్టుకు ముందడుగు అందించాడు.18వ నిమిషంలో డెక్లాన్ రైస్ వేసిన కార్నర్ కిక్‌ను అందిపుచ్చుకున్న డిఫెండర్ ఎజ్రి కొన్సా హెడ్డర్ ద్వారా బంతిని నెట్లోకి పంపి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 2-0 తేడాతో రెట్టింపు చేశాడు.37వ నిమిషంల ఇంగ్లాండ్ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ ఎబెరెచి ఈజడ్ఈ అందించిన అద్భుత పాస్‌ను బుకాయో సాకా క్లాసిక్ స్ట్రైక్‌తో గోల్‌గా మలిచాడు. 45+1వ నిమిషంలో మొదటి అర్ధభాగం ముగిసేలోపు ఇంజూరీ టైమ్‌లో ఈజడ్ఈ నుంచి వచ్చిన మరో పాస్‌ను సాకా గోల్‌గా మార్చి తన వ్యక్తిగత రెండో గోల్‌ను నమోదు చేయడంతో పాటు ఇంగ్లాండ్‌కు 4-0తో తిరుగులేని లీడ్ ఇచ్చాడు.
England-Beats-France-6-4 : ఫ్రాన్స్ కంబ్యాక్
ద్వితీయార్థం ప్రారంభం కాగానే ఫ్రాన్స్ దూకుడు పెంచింది. 48వ నిమిషంలో కైలియన్ ఎమ్బాప్, 54వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బ్రాడ్లీ బార్కోలా గోల్స్ చేయడంతో స్కోరు 4-2 గా మారింది.66వ నిమిషం మైఖేల్ ఒలిస్ అందించిన అసిస్ట్నుఎంబాప్పే మళ్లీ గోల్‌గా మలిచాడు. ఇంగ్లాండ్ 4-0 లీడ్ కాస్తా 4-3 కి పడిపోవడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పీక్స్‌కు చేరింద87వ నిమిషం (సాకా హ్యాట్రిక్): ఒత్తిడిలో ఉన్న ఇంగ్లాండ్‌కు పెనాల్టీ లభించింది. బుకాయో సాకా పెనాల్టీని విజయవంతంగా గోల్‌గా మార్చి ఈ ప్రపంచ కప్‌లో తన సంచలన హ్యాట్రిక్ పూర్తి చేశాడు. 90+6వ నిమిషంలో ఇంజూరీ టైమ్‌లో దెంబెలే మరో గోల్ చేసి ఫ్రాన్స్‌కు ఆశలు రేకెత్తించాడు. మ్యాచ్ ముగియడానికి సరిగ్గా రెండు నిమిషాల ముందు స్టార్ మిడ్‌ఫీల్డర్ జుడే బెల్లింగ్‌హామ్ మైండ్ బ్లోయింగ్ గోల్ కొట్టి ఫ్రాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. దీనితో ఇంగ్లాండ్ 6-4 తో విజయాన్ని ఖరారు చేసుకుంది.
England-Beats-France-6-4 : రికార్డుల మోత
:
కైలియన్ ఎమ్బాప్ ఆల్‌టైమ్ రికార్డు: ఈ మ్యాచ్‌లో 2 గోల్స్ సాధించడం ద్వారా ఎమ్బాప్ తన ప్రపంచ కప్ కెరీర్ గోల్స్ సంఖ్యను 22 కి చేర్చాడు. తద్వారా ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆల్‌టైమ్ నంబర్ 1 ఆటగాడిగా సరికొత్త చరిత్ర లిఖించాడు. అలాగే ఈ 2026 టోర్నమెంట్లో 10 గోల్స్‌తో టాప్‌లో నిలిచాడు.
జుడే బెల్లింగ్‌హామ్ రికార్డు: చివరి నిమిషంలో చేసిన గోల్‌తో బెల్లింగ్‌హామ్ ఇంగ్లాండ్ తరఫున ప్రపంచ కప్ చరిత్రలో 7 గోల్స్ సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
బుకాయో సాకా హ్యాట్రిక్ హీరో: ఫ్రాన్స్ వంటి దిగ్గజ జట్టుపై వరల్డ్ కప్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి ఇంగ్లాండ్ విజయంలో రియల్ హీరోగా నిలిచాడు.
మైఖేల్ ఒలిస్ అసిస్ట్‌లు: ఫ్రాన్స్ ప్లేమేకర్ ఒలిస్ ఈ టోర్నమెంట్లో మొత్తం 7 అసిస్ట్‌లు అందించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఒక బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఏకంగా 10 గోల్స్ నమోదు కావడం, చివరి నిమిషం వరకు విజయం ఎవరిదో తెలియకుండా సాగడం ఫుట్‌బాల్ అభిమానులకు ఒక అద్భుతమైన విందుగా నిలిచింది!
