Incident | ఆత్మహత్యగా చిత్రీకరించి భర్త పరారీ?

Incident | ఆత్మహత్యగా చిత్రీకరించి భర్త పరారీ?
Incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను భర్త హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మృతురాలు మీనాక్షి పేరు మీద కోటి రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఉండగా.. ఇంటిపై రూ.80 లక్షల రుణం ఉన్నట్లు సమాచారం. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం భర్త శివాజీ ఈ దారుణానికి పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
మీనాక్షిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన అనంతరం.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నివేశం సృష్టించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటన తర్వాత శివాజీ పరారైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు పోలీసులను కోరుతున్నారు.
