Football | భారత ఫుట్‌బాల్‌పై సీఎం రేవంత్ ఆశాభావం
ఒక రోజు భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడుతుంది..
ఆ భవిష్యత్ తారల్లో తెలంగాణ ఆటగాళ్లు ఉంటారు
సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష
Football | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఫుట్‌బాల్‌పై తనకున్న అభిమానాన్ని, భారత ఫుట్‌బాల్ భవిష్యత్‌పై తన దృష్టిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచుకున్నారు. ప్రపంచకప్ ఫుట్‌బాల్‌కు తన మద్దతు వెనుక కేవలం క్రీడాభిమానం మాత్రమే కాకుండా, భారత ఫుట్‌బాల్ అభివృద్ధిపై ఓ పెద్ద లక్ష్యం ఉందని తెలిపారు.సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువచ్చి తెలంగాణ చిన్నారులతో మైదానాన్ని పంచుకునే అవకాశం కలగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
ఒక రోజు భారత ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆడుతుందని, అంతేకాకుండా భారత్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆ భవిష్యత్ ఫుట్‌బాల్ స్టార్లలో పలువురు తెలంగాణ నుంచి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫుట్‌బాల్ అభివృద్ధికి యువ క్రీడాకారులను ప్రోత్సహించడం, వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
