ముంపు గ్రామాలలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు
ఏలూరు/ వేలేరుపాడు/ కుక్కునూరు, ఆంధ్రప్రభ: జిలాల్లోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని వరద ముంపు గ్రామాలలో సహాయక, పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాలతో ఆదివారం జిల్లా యంత్రాంగం యుద్ధప్రతిదికన చేపట్టింది. గోదావరి వరద ఉధృతి కారణంగా ముంపునకు గురైన గ్రామాలలో వరద నీరు తగ్గిన వెంటనే సహాయక కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం చేపట్టింది.
వేలేరుపాడు మండలంలోని కోయిడా 11 కెవి ఫీడర్ నుండి కొండ ప్రాంతంలోని 9 గ్రామాలకు వెళ్లే విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులను విద్యుత్ శాఖ ఎస్ఈ కె.ఎం. అంబేద్కర్, ఈఈలు, పర్యవేక్షణలో విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరించారు. వరదనీరు ఉన్నప్పటికీ కోయిడా వద్ద పేదవాగులో లాంచీలు, పడవలలో వెళ్లి గోదావరి వరద నీటిలో మునిగిపోయిన 9 గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ తీగలను, వరదనీటికి కొట్టుకువచ్చిన మొక్కలను తొలగించి విద్యుత్ తీగలను సరిచేసి ఆయా గ్రామాలకు గంటల వ్యవధిలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
