చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మహిళలు గల్లంతు..

  • ఇద్దరి మృతదేహాలు లభ్యం
  • ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద విషాదం

చింతూరు ఏజెన్సీ, ఆంధ్రప్రభ : పోలవరం చింతూరు ఏజెన్సీలోని ఎటపాక మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ లోని గొల్లగూడెం గ్రామంలోని గోదావరి నది వద్ద చేపల వేటకు వెళ్లి ముగ్గురు మహిళలు లక్ష్మీ,భారతి, సుశీల ఇద్దరు పురుషులు బాలరాజు, రమేష్లు గల్లంతు అయ్యారు. వీరిలో ఇద్దరు మృత దేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.