కూతురి నిశ్చితార్థానికి పిలిచేందుకు వెళ్లి వస్తూ..

ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

రాజుపాలెం, ఆంధ్రప్రభ: అతి వేగంతో ఆర్టీసి బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కోటనెమలిపురి గ్రామం కోల్డ్ స్టోరేజ్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మాచర్ల నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసి బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అదే గ్రామానికి చెందిన ఆదిమూలం.కాశయ్య(35) అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

తన పెద్ద కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం సందర్భంగా అనుపాలెం గ్రామంలోని తన బంధువులకు తెలియజేసి తిరుగు ప్రయాణంలో కోల్డ్ స్టోరేజ్ వద్దకు వచ్చేసరికి రోడ్డు ప్రమాదంలో మరణించాడనే వార్త ఆ కుటుంబాన్ని కలచివేసింది. మృతునికి భార్య ఇరువురి కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.