దాహంతో అల్లాడిన కోతి ప్లాస్టిక్ కవర్‌లో పెరుగు తాగిన వైనం

దాహంతో అల్లాడిన కోతి ప్లాస్టిక్ కవర్‌లో పెరుగు తాగిన వైనం

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణంలో వేసవి తాపం మూగజీవాలను వణికిస్తోంది. కాలేజీ రోడ్డు సెంటర్‌ సమీపంలో మంగళవారం ఒక కోతి దాహంతో నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడింది.ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఆ కోతి రోడ్డు పక్కన పార్క్ చేసిన బైక్ దగ్గరికి వచ్చింది.ఎవరో పారేసిన ప్లాస్టిక్ కవర్‌లో ఉన్న కొద్దిపాటి పెరుగుని ఆత్రంగా తాగింది.మరో చోట అదే కవర్‌ను నేలపై పెట్టుకొని తాగుతూ కనిపించింది.స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయారు.చెరువులు కుంటలు అన్నీ ఎండిపోయాయి.

మూగజీవాలు నీటి చుక్క కోసం ఇలా రోడ్ల మీదికి వస్తున్నాయి అని స్థానిక యువకుడు సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. పర్యావరణవేత్తలు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు, దుకాణాల వద్ద మట్టి పాత్రలలో మూగజీవాల కోసం నీటిని ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి అటవీ ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.