kohli | ఐపీఎల్ మొత్తం ఆదాయం రూ.230 కోట్లు

kohli | ఐపీఎల్ మొత్తం ఆదాయం రూ.230 కోట్లు

kohli |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఆదాయం పొందిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. అతడి మొత్తం ఐపీఎల్ ఆదాయం సుమారు రూ. 230 కోట్లకు పైగా ఉంది. ఫెనాటిక్‌ స్పోర్ట్స్, హురూన్‌ ఇండియా వెల్ల‌డించిన నివేదికల ప్రకారం.. కోహ్లీ ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ. 230.2 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ రూ. 227 కోట్లతో రెండో స్థానంలో, ఎంఎస్ ధోనీ రూ. 200 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ కోహ్లీకి ఏడాదికి రూ. 21 కోట్ల జీతాన్ని చెల్లిస్తోంది. 2008లో మొదటి ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీకి లభించిన ప్రాథమిక వేతనం కేవలం రూ. 12 లక్షలు మాత్రమే.