అంచలంచెలుగా ఎదిగిన బీజేపీ జన సంగ్ నుండి బీజేపీ వరకు..
అంచలంచెలుగా ఎదిగిన బీజేపీ జన సంగ్ నుండి బీజేపీ వరకు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రారంభించిన జంక్షన్ నుండి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు అయ్యేంతవరకు పార్టీ జాతీయ స్థాయిలో అధికారం చేపట్టి దేశాన్ని ప్రపంచాన్ని శాసించే దిశగా ముందుకు సాగుతుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ బిజెపి జిల్లా అధ్యక్షుడు కూకట్ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బిజెపి శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
రెండు పార్లమెంట్ స్థానాల నుండి నేడు మూడోసారి కేంద్రంలో అధికారం చెప్పిన ఘనత భారతీయ జనతా పార్టీకి మాత్రమే లభిస్తుందని అన్నారు క్రమశిక్షణ దేశభక్తి త్యాగం తదితర కారణాల మూలంగా బిజెపి ప్రపంచంలోకెల్లా అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా రూపొందినని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సత్యనారాయణ రెడ్డి బిజెపి ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్ కౌన్సిలర్లు స్రవంతి శ్యామ్ రెడ్డి లావణ్య రుచిత తదితరులు పాల్గొన్నారు
