IPL Cricket | మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు

IPL Cricket | మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు
IPL Cricket | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఆరంభించింది. అయితే హైదరాబాద్ జట్టుకు లక్నో బౌలర్లు షాక్ ఇచ్చారు. నాలుగు ఓవర్లకే మూడు వికెట్లు తీసి దెబ్బేశారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(7), అభిషేక్ శర్మ(0), కెప్టెన్ ఇషాన్ కిషన్(1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. మహ్మద్ షమీ ఓపెనర్లిద్దరినీ ఔట్ చేశాడు. ఇషాన్ కిషన్‌ను ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ చేశాడు. లివింగ్ స్టోన్, క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నారు. అభిషేక్ శర్మ రెండు బంతులు ఆడి డకౌట్ అయ్యి వెనుదిరిగాడు.
