ఘనంగా దేవీ విగ్రహ నిమజ్జనోత్సవం

ఘనంగా దేవీ విగ్రహ నిమజ్జనోత్సవం
చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్ల (Chevella) లో దసరా పర్వదినం ఘనంగా జరిగింది. విజయదశమి పర్వదినం పురస్కరించుకొని చేవెళ్లలోని రచ్చబండ వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గత పది రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ రోజు రచ్చబండ వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనోత్సవం ర్యాలీని ప్రారంభించారు.
పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద అమ్మవారి విగ్రహం ముందు మహిళలు బతుకమ్మ ఆటపాటతో అలరించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో బతుకమ్మ ఆటపాట (Bathukamma play song) ను కొనసాగించారు. ర్యాలీకి హాజరైన వారికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. సాయంత్రం పట్టణ కేంద్రంలోని పుష్కరిణిలో అమ్మవారి ఉత్సవ ప్రతిమను నిమజ్జనం చేస్తారు. సాయంత్రం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో చేవెళ్ల ప్రజానీకం పాల్గొంటారు. పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చేవెళ్ల పట్టణంతోపాటు పరిసర గ్రామాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
