స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో..

స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు కొట్టం గుట్ట తండాలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర రెడ్డి సహకారంతో 11వ వార్డులో నాలుగు బోర్లు మంజూరు చేసి రెండు బోర్లను ప్రారంభించడం జరిగిందని 11వ వార్డు కౌన్సిలర్ గోరీ బాయి తెలిపారు. వేసవికాలంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం సహకరించిన స్పీకర్ ప్రసాద్ కుమార్, గడ్డము అనన్యకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర రెడ్డి నాయకులు సామా ప్రభాకర్ రెడ్డికి గోరీ భాయ్ బాబు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.