పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే పాడి కౌశిక్ రెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయాలని కోరడమైనది.
అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి మాట్లాడుతూ దళితుల పట్ల దొరల అహంకారాన్ని శాసనసభ సాక్షిగా విషం చింమ్మిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి తక్షణమే తొలగించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాసంపల్లి లింగాజి, గాదె మహేందర్ రెడ్డి, మహమ్మద్ ఇబ్రహీం పాష, నామాల బుచ్చయ్య, గొరిగే రవి, కావటీ భాస్కర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కడారి రవి, లోనే రవీందర్, మార్కెట్ డైరెక్టర్ లు సిద్ధేశ్వర్, తోటకూర రమేష్, బాషుమియా, పోకల శివకుమార్, గడ్డమీది కిరణ్ గౌడ్, సర్పంచ్ లు బొమ్మ వీరస్వామి, అబ్రహం, వల్లాల అశోక్ , డ్యాగల రాజశేఖర్, ఈర్య నాయక్, లోకుంట్ల క్రాంతి, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వాకిటి చంద్రారెడ్డి, మోతిలాల్, రామచందర్, కొంకీస్ ప్రకాష్ రెడ్డి, బాల్రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
