Ormax Media | బాలీవుడ్ స్టార్ ని వెనక్కి నెట్టి..!

Ormax Media | బాలీవుడ్ స్టార్ ని వెనక్కి నెట్టి..!
Ormax Media | ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్స్‌గా ప్రభాస్, సమంత హవా
ఓర్మాక్స్ మీడియా జాబిత విడుదల
Ormax Media | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఓర్మాక్స్ మీడియా’ (Ormax Media) మార్చి నెలకు సంబంధించిన ‘మోస్ట్ పాపులర్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్’ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, సోషల్ మీడియా ట్రెండ్స్ ఆధారంగా రూపొందించిన ఈ రేటింగ్స్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ తారలను సైతం వెనక్కి నెట్టి మన టాలీవుడ్ స్టార్స్ నంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్-10 స్టార్స్ పూర్తి జాబితా..
టాప్ 10 హీరోలు:
ప్రభాస్
అల్లు అర్జున్
దళపతి విజయ్
షారుఖ్ ఖాన్
మహేష్ బాబు
రామ్ చరణ్
సల్మాన్ ఖాన్
రణ్‌వీర్ సింగ్
జూనియర్ ఎన్టీఆర్
అక్షయ్ కుమార్
టాప్ 10 హీరోయిన్లు..
సమంత
ఆలియా భట్
రష్మిక మందన్న
దీపికా పదుకొనే
కాజల్ అగర్వాల్
సాయి పల్లవి
నయనతార
త్రిష
కృతి సనన్
శ్రీలీల
