మైలారం చక్రు తండాలో ఘనంగా దుర్గమ్మ పండుగ

రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలం లోని మైలారం గ్రామం చక్రు తండాలో దుర్గమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తండా ప్రజలు సంప్రదాయ వస్త్రధారణలో డప్పు వాయిద్యాలతో అమ్మవారిని ఊరేగించి మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజన ఆచార వ్యవహారాలతో భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో మహిళలు బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి తండా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపి, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, దేవరుప్పుల మండల పార్టీ నాయకులు ఏలే సుందర్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, మండల పార్టీ నాయకులు పసునూరి శ్రీనివాస్, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, బిక్షపతి, గుగులోత్ చందు నాయక్, వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply