Flight Crash | డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా ఆరుగురు మృతి. ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు

Flight Crash | డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా ఆరుగురు మృతి. ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
- జిల్లా పరిషత్ ప్రచార కార్యక్రమానికి వెళ్తుండగా విషాదం…
Flight Crash | జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా కుప్పకూలిన విమానం
DGCA ధృవీకరణ, విచారణ ప్రారంభం
సాంకేతిక కారణాలపై విచారణ చేపట్టిన డీజీసీఏ
అజిత్ పవార్ అంత్యక్రియలు ముగింపు
బారామతిలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
రాజకీయ నేతల సంతాపం
అమిత్ షా, నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడణవీస్ సహా పలువురు హాజరు
Flight Crash | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతిచెందిన విషాద సంఘటన ఇవాళ చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్తుండగా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా ధృవీకరించింది.
Flight Crash |ప్రమాద వివరాలు:
డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు కొంతమంది ఎన్సీపీ నేతలు, విమాన సిబ్బంది ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ బయలుదేరగా, సాంకేతిక కారణాల వల్ల మధ్యలోనే విమానం కుప్పకూలడంతో భారీ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద వార్తపై రాష్ట్ర, కేంద్ర నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాదానికి కారణాల గురించి డీజీసీఏ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Flight Crash | ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు

విమాన ప్రమాదంలో మృతిచెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి. బుధవారం జరిగిన ఈప్రమాదంలో డిప్యూటీ సీఎంతో సహా ఐదుగురు మృతిచెందిన విషయం విధితమే. అయితే అధికారిక లాంఛనాలతో బారామతిలోని విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అజిత్ చితికి కుమారులు పార్థ్, జే నిప్పంటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, సీఎం దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే, ఏపీ మంత్రి నారా లోకేశ్, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తమ అభిమాన నేతకు వీడ్కోలు పలికేందుకు ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
clicck here to read more
click here to read Accident | ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
