nara lokesh | నాడు కియా కార్లు తెచ్చినా, నేడు ఫైటర్ జెట్లు వచ్చినా బాబు వల్లే..
nara lokesh | నాడు కియా కార్లు తెచ్చినా, నేడు ఫైటర్ జెట్లు వచ్చినా బాబు వల్లే..
nara lokesh | 23నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రపంచానికి చూపించాం
వాళ్లది ఫ్యాక్షన్…మనది ఫైటర్ జెట్… అర్థమైందా రాజా…
ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
nara lokesh | పుట్టపర్తి ఆంధ్రప్రభ : పుట్టపర్తిలో ఏర్పాటయ్యే ఏఎంసీఏ (అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ శంకుస్థాపనతో శ్రీ సత్యసాయి జిల్లా చరిత్రను మార్చబోతుంది. డిఫెన్స్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారాలోకేష్ పేర్కొన్నారు. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రరక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పవిత్ర భూమి ఈరోజు భారతదేశ రక్షణరంగ కొత్త శక్తి కేంద్రంగా మారుతోంది.
అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ.
యువగళం పాదయాత్ర నుంచి చూస్తున్నాను. ఉమ్మడి అనంతపురం జోషే వేరు, ఈజోష్ ఎప్పుడు అదిరిపోతుంది. ఉమ్మడి అనంతపురం, గత ఎన్నికల్లో ఎన్డీఏకి కంచుకోట.14 అసెంబ్లీ సీట్లకు 14 సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేయడం జరిగిందన్నారు. అందుకే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నామన్నారు.అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్, కరువు నేలపై కార్లు పరిగెత్తించిన ఘనత మన విజనరీ ముఖ్యమంత్రి సీఎందేనన్నారు.
వాళ్ల ముగ్గురు 75ఏళ్ల కుర్రాళ్లు…
ఆపరేషన్ సిందూర్‌కు ఒక సంవత్సరం పూర్తి అయిందని,మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇచ్చిన ఘటన అని గుర్తు చేశారు. దానికి ప్రతి భారతీయుడు గర్వపడాలన్నారు. ఆపరేషన్ సిందూర్ వెనుక అతిపెద్ద శక్తి, మన ఐరన్ మ్యాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రమే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. దేశం అంతా నమో అంటే నరేంద్ర మోదీజీ. ఏపీలో నమో అంటే నాయుడు జీ, మోదీ జీ. ఇదిఒక పవర్ఫుల్ కాంబినేషన్ మోదీజీ, రాజ్ నాథ్ సింగ్ జీ, మన నాయుడు కు ఒక కామన్ థింగ్ ఉంది వీరంతా 75 ఏళ్ల కుర్రాళ్ల వాళ్ల స్పీడ్ చూస్తే నాకు డౌట్ వస్తుంది. వాళ్లలోని ప్రతి ఒక్కరిలో ఒక 25 ఏళ్ల కుర్రాడు ఉన్నారన్నారు.
నమో జోడీ వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు…
గూగుల్ డేటా సెంటర్ 1.35 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్. ఆర్సెలార్ మిట్టల్ 1.35 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు పుట్టపర్తిలో ఫైటర్ జెట్స్ లక్షకోట్ల పెట్టుబడులు. అమరావతి, పోలవరానికి నిధులు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాము. విశాఖ రైల్వే జోన్ తెచ్చుకున్నాం. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ రాబోతోందన్నారు. ఇవన్నీ సాధించుకున్నామంటే అది నమో జోడి (నాయుడు, మోడీజీ) వల్లే సాధ్యమైందని అన్నారు. 23 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో దేశానికి చూపించామని తెలిపారు.
ఏఎంసీఏతో యువతకు ఉద్యోగాలు…
జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్, పుట్టపర్తిలో ఏఎంసీఏ, డిఫెన్స్ ఆర్ అండ్ డి ఆర్గనైజేషన్ (DRDO), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కలిసి AMCA ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) దశాబ్దాలుగా బెంగళూరును అభివృద్ధి చేసింది. అదే తరహాలో AMCA పుట్టపర్తిని అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ 5వ తరం స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ జెట్స్ తయారు చేస్తారు. భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోసివ్స్ లిమిటెడ్‌తో పాటు అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. దీనివల్ల ఈ ప్రాంత యువతకు పెద్దఎత్తున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఒక్క కియాతో ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏఎంసీఏతో ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో నెంబర్ 1 కావడం ఖాయం. ఇది కేవలం ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ కాదు…ఇది రాయలసీమ భవిష్యత్తుకు కొత్త దిశ ఇచ్చే ప్రాజెక్ట్. ఇవాళ పుట్టపర్తి కేవలం ఒక ఆధ్యాత్మిక నగరం కాదు… భారత రక్షణరంగ భవిష్యత్తు కేంద్రంగా మారుతోంది.
ప్రధాని మోడీజీ, రాజ్ నాథ్‌లకు ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్‌కు ఇంత మహత్తరమైన రక్షణ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జీ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మేము హామీ ఇస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ 2047 నిర్మాణంలో బలమైన భాగస్వామ్యం అందిస్తుంది. ఇంత దూరం వచ్చి పంచ్ లేకపోతే ఎలా… మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. వాళ్లది ఫాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ – మనది ఫైటర్ జెట్ బ్యాక్‌గ్రౌండ్. వాళ్లది కిడ్నాప్ బ్యాక్‌గ్రౌండ్ – మనది కియా బ్యాక్‌గ్రౌండ్. రెండిటికీ చాలా తేడా ఉంది అర్థమైందా రాజా…అంటూ యువనేత లోకేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు.
CLICK HERE TO READ 1800ElectricityConnections | విద్యుత్.. సంక్షోభం
