2 lovers I ప్రేమ కోసం జైలు గోడలూ అడ్డుకాలేదు.. పెరోల్‌పై వచ్చి పెళ్లాడిన యువకుడు

2 lovers I ప్రేమ కోసం జైలు గోడలూ అడ్డుకాలేదు.. పెరోల్‌పై వచ్చి పెళ్లాడిన యువకుడు

2 lovers I జైలులో ఉన్న ప్రియుడినే పెళ్లి చేసుకుంటానన్న యువతి
భారీ భద్రత మధ్య జరిగిన అరుదైన వివాహం
బేడీలతో పెళ్లి మండపానికి వచ్చిన పెళ్లికొడుకు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రేమ కథ

2 lovers I ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : సాధారణంగా ప్రేమ కథల్లో ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి. కానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకర ఘటన ‘ప్రేమకు ఏదీ అడ్డంకి కాదు’ అని నిరూపిస్తోంది. తాను ప్రాణంగా ప్రేమించిన యువకుడు ఒక కేసులో జైలుకు వెళ్లినప్పటికీ, అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి మరీ ఆ ప్రియురాలు తన ప్రియుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచింది. జైలులో ఉన్న తన ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని యువతి తన కుటుంబాన్ని ఒప్పించింది. ఆమె పట్టుదలను చూసిన పెద్దలు చివరకు ఈ వివాహానికి అంగీకరించారు. దీంతో ఆ యువకుడు తన పెళ్లి కోసం కోర్టు నుండి పెరోల్ పొంది యువతిని వివాహం చేసుకున్నాడు.

అయితే కోర్టు నిబంధనల ప్రకారం.. పోలీసులు ఆ యువకుడిని భారీ భద్రత మధ్య వివాహ వేదికకు తీసుకువచ్చారు. పెళ్లి ఆచారాల సమయంలో ఊరేగింపులో (భరాత్) సమయంలో కూడా పోలీసులు అతడి వెంటే ఉండి భద్రతను పర్యవేక్షించారు.

వివాహ వేడుకలో పెళ్లికొడుకు చుట్టూ పోలీసులు ఉండటం, భద్రతా కారణాలతో యువడికి బేడీలు వేయడం లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఇక్కడ అందరినీ ఆకట్టుకున్న అంశం మాత్రం ఆ యువతి అంకితభావంనే చెప్పాలి. కష్టకాలంలోనూ తన ప్రియుడికి తోడుగా నిలబడటాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.

CLICK HERE TO READ 2026exam | నీట్ లీకేజీతో విద్యార్థుల్లో ఆందోళన

CLICK HERE TO READ MORE

Leave a Reply