పాఠశాలల ప‌నితీరుపై ఆకస్మిక తనిఖీ…

పాఠశాలల ప‌నితీరుపై ఆకస్మిక తనిఖీ…

మోపిదేవి – ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం మోపిదేవి, వెంకటాపురం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు ఆకస్మిక తనిఖీ చేశారు. వెంకటాపురం జడ్పీ హైస్కూల్లో టెన్త్ విద్యార్థుల సంసిద్ధతను పరిశీలించి ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కావాలని సూచించారు. ఎంపీపీ స్కూల్లో విద్యార్థుల పఠన సామర్ధ్యం పరిశీలించి, పిల్లలకు పాటలు కూడా రాకపోవటంపై ఉపాధ్యాయునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిల్లలతో బట్టి పట్టించవద్దని స్పష్టం చేసిన ఎమ్మెల్యే పాఠ్య పుస్తకాలలో పాటలు కూడా నేర్పలేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని జిల్లా విద్యా శాఖ అధికారి దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు. అనంతరం మోపిదేవి ఎంపీపీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ భోజనం రుచి చూసి నాణ్యత పరిశీలించారు. మోపిదేవి ఎంపీపీ స్కూల్లో చక్కని తెలుగు పద్యాలు ఆలపించి ఆకట్టుకున్న నాలుగో తరగతి విద్యార్థిని పుష్ప హర్షితను అభినందించారు.

Leave a Reply