Mojtaba Alive : ఇతడు.. అతడే Andhra Prabha News

Mojtaba Alive : ఇతడు.. అతడే Andhra Prabha News

  • బతికే ఉన్నాడు
  • ఇరాన్​ సుప్రీం లీడర్​
  • ముజ్తబా ఖమేనీ
  • ఇరాన్​ కబురు ఇది
  • యాక్షన్​ వీడియో వైరల్​
  • అది ఏఐ క్రియేటెడ్​
  • నిపుణుల అనుమానం

( ఆంధ్రప్రభ, టెహ్రాన్​ ప్రతినిధి)

Mojtaba Alive

ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారు, ఇరాన్ ప్రభుత్వం మిత్రదేశాలు కూడా ధృవీకరించాయి. గత ఫిబ్రవరిలో దాడుల తర్వాత ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఇటీవల వైట్​ హౌస్​ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మాట్లాడుతూ, ఆపరేషన్​ ఎథిక్​ పూరీ ఆరంభంలోనే ఇరాన్​ నాయకులు చనిపోయారని, ఇరాన్​ పాలించే నాయకులు లేరని వ్యాఖ్యానించారు. తాజా సమాచారం సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ చాలా యాక్టివ్​ గా ఉన్నారు. ఈ ఇరాన్ పైనిక​ కార్యాచరణను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు ఇరాన్​ అధికారిక పత్రిక ఓ వీడియోను విడుదల చేసింది. ఆయన సైనిక కార్యాలయంలోకి సీరియపస్​ గా వెళ్లి కమాండ్​ కంట్రోల్​ ను పరిశీలిస్తున్న దృశ్యాలను వైరల్​ చేశారు.

Mojtaba Alive : ఇది ఇరాన్​ కబురు

Mojtaba Alive

ముజ్తబా ఖమేనీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, యుద్ధ పరిస్థితుల దృష్ట్యా భద్రతా కారణాలతో ఆయన బహిరంగంగా కనిపించడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. ఇరాన్‌లోని రష్యా రాయబారి కూడా ముజ్తబా ఖమేనీ ఇరాన్‌లోనే ఉన్నారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లోకి రావడం లేదని ధృవీకరించారు అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఆయనకు ముఖం కాలికి స్వల్ప గాయాలయ్యాయని కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. వీటిని ఇరాన్ తోసిపుచ్చింది.

Mojtaba Alive : వీడియో వైరల్​

సోమవారం (ఏప్రిల్ 6, 2026) ఆయన ఒక మిలిటరీ వార్ రూమ్‌లో ఉన్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. , ఆ వీడియో AI (కృత్రిమ మేధ) సాయంతో సృష్టించినట్టు నిపుణులు అనుమానిస్తున్నారు. సుప్రీం లీడర్ ముజ్తబా తండ్రి ఆయతుల్లా ఖమేనీ మరణం తరువాత ముజ్తబాను ఆయన బతికే ఉన్నారని అధికారిక వర్గాలు చెబుతున్నప్పటికీ, ప్రజల ముందుకు రాకపోవడంతో ఇంకా సందేహంతో ఆయన కోసం ప్రపంచ దేశాలు వేచి చూస్తున్నాయి.

ALSO READ : 15 Places Smash : ఇజ్రాయెల్​ ఉక్కిరి బిక్కిరి Andhra Prabha News

Leave a Reply