Iran-Attack ఇరాన్​ లంగరు Andhra Prabha Top News

ఇరాన్​ లంగరు Andhra Prabha Top News

  • సింగపూర్​ నౌకపై దాడి
  • ఐఎంవో ఆపరేషన్​ నిలిపివేత
  • 11 వేల మంది నావికుల భద్రతపై ఆందోళన
  • గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు..
  • ప్రపంచ చమురు రవాణాపై ప్రభావం

( ఆంధ్రప్రభ, టెహ్రన్​ ప్రతినిధి )

దాదాపు 120 రజులుగా పర్షియన్​ గల్‌ఫ్​ లో చిక్కుకున్న వందలాది వాణిజ్య నౌకలు.. వేలాది మంది నావికులను.. తరలించేందుకు ఐఎంవో చేపట్టిన ఆపరేషన్​ ఎవక్యూఫన్​ కు తత్కాలిక బ్రేక్​ పడింది. 14 అంశాలతో అమెరికా ఇరాన్​ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో…. ఐక్య రాజ్య సమితి ఆధీనంలోని ఐఎంవో కైకల తరలింపు క్రతువు చేపట్టింది. ఇంతలో ఒమన్ తీరంలో సింగపూర్ వాణిజ్య నౌకపై IRGC దాడితో… శాంతి ఒప్పందం యూటర్న్​ తీషుకు::ది? హర్మూజ్ జలసంధిని సింగపూర్​ వాణిజ్య దాటుతున్న సమయంలో జరిగిన ఈ దాడితో , అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందానికి అంతర్జాతీయ నౌకాయానానికి పెద్ద సవాలుగా మారింది.

Iran-Attack : ‘సింగపూర్​ నౌకకు షాక్​

తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ సంస్థ సింగపూర్ జెండాతో నడుపుతున్న “ఎవర్ లవ్లీ” అనే కంటైనర్ కార్గో నౌక ఒమన్‌లోని ‘దాహిత్’ రేవుకు ఆగ్నేయంగా 7.5 నాటికల్ మైళ్ల దూరంలో, హర్మూజ్ జలసంధి ప్రవేశ మార్గంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ విప్లవాత్మక సైన్యం ప్రయోగించిన ఒక అపరిచిత క్షిపణి లేదా డ్రోన్ నౌక కుడి వైపు బలంగా తాకింది. నౌక నియంత్రణ గది (Bridge) దెబ్బతింది. అదృష్టవశాత్తూ నౌకలో సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పర్యావరణానికి (చమురు లీకేజీ వంటివి) ఎటువంటి నష్టం వాటిల్లలేదని బ్రిటన్ నావికా సంస్థ UKMTO ధృవీకరించింది. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందే, ఇరాన్ సైన్యం ఒక హెచ్చరిక జారీ చేసింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలు కేవలం ఇరాన్ అనుమతించిన కేటాయించిన మార్గాల్లోనే వెళ్లాలని, అలా కాకుండా ఐక్యరాజ్యసమితి (UN) నిర్దేశించిన మార్గాల్లో వెళ్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. “ఎవర్ లవ్లీ” నౌక కూడ ఇరాన్ అనుమతించని మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ దాడి జరిగినట్లు అమెరికా రక్షణ అధికారులు పేర్కొన్నారు.

Iran-Attack రెస్క్యూ ప్లాన్ నిలిపివేత

గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వందలాది వాణిజ్య నౌకలను, దాదాపు 11,000 మంది నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (IMO) ఒక ఎవాక్యుయేషన్ (ఖాళీ చేయించే) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ తాజా దాడితో నావికుల భద్రతను పునఃసమీక్షించేందుకు IMO ఈ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని రోజుల కిందటే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధాన్ని ముగించడానికి, అంతర్జాతీయ నౌకాయానాన్ని పునరుద్ధరించడానికి ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరింది. ఇరాన్ తాజా దాడితో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇది పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలను పెంచుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Iran-Attack గల్ఫ్ దేశాలకు అమెరికా భరోసా

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రస్తుతం గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందంపై గల్ఫ్ మిత్రదేశాలకు భరోసా ఇస్తున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఇరాన్ నౌకలను అడ్డుకుంటే అమెరికా ఊరుకోదని, తీవ్రమైన చర్యలు ఉంటాయని రూబియో హెచ్చరించారు . ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక హర్మూజ్ జలసంధిలో మళ్లీ దాడులు ప్రారంభమవడంతో, అంతర్జాతీయంగా సరుకు రవాణా ఛార్జీలు , నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన వస్తువుల ధరలపై ప్రభావం చూపవచ్చు.ఈ ప్రాంతంలో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ భద్రతా సంస్థలు సూచించాయి

Iran-Attack ఐఎంవో జాబితాలో లేదు

తమ జాబితాలోని అన్ని నౌకలకు రక్షణ కల్పించి తరలిస్తున్నామని, ఈ ప్రక్రియ విజయవంతగా సాగుతోందని IMO సెక్రటరీ-జనరల్ ఆర్సెనియో డొమింగెజ్ ఒక ప్రకటనలో తెలిపారు. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించిన ఒక నౌకపై గురువారం ఒమన్ గల్ఫ్‌లో దాడి జరిగినట్లు తమకు సమాచారం అందిందని, అయితే ఆ నౌక ఐఎంఓ జాబితాలో లేదని ఆయన తెలిపారు.సముద్రయాన సిబ్బంది భద్రతే అత్యంత ప్రాధాన్యం అని అందువల్ల, సమన్వయంతో నౌకాయాన భద్రతను నిర్ధారించడానికి, మరింత స్పష్టత వచ్చే వరకు ఈ తరలింపు ప్రణాళికను నిలిపివేస్తాం అని ఆయన అన్నారు. .”

Iran-Attack అనధికార మార్గాల్లో వెళ్తే.. ఇంతే

పర్షియన్ గల్ఫ్ సీవేస్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ ఇరాన్ ప్రతినిధి గురువారం మాట్లాడుతూ, తమ నిర్దేశిత మార్గాలకు వెలుపల ప్రయాణించే నౌకలకు సురక్షిత ప్రయాణానికి హామీ ఉండదని, వాటికి బీమా లేదా సంబంధిత బాధ్యతలు వర్తించవని తెలిపింది. “అనధికారిక మార్గాల్లో ప్రయాణించడం వల్ల కలిగే పరిణామాలకు నౌక యజమాని, ఆపరేటర్ కమాండర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది,” అని X లోని ఒక పోస్ట్‌లో అది పేర్కొంది.